Boat Captain License : ఈ హీరోకి బోట్ కెప్టెన్ లైసెన్స్ ఉందని తెలుసా..? ఏకంగా దుబాయ్ లో 40 అడుగుల బోట్ ని కొనుక్కొని..
తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. (Boat Captain License)
Boat Captain License
Boat Captain License : చాలా మంది హీరోలకు నటన మాత్రమే కాకుండా వేరే రంగాల్లో కూడా ప్రవేశం ఉంది. తాజాగా ఈ సీనియర్ హీరోకి బోట్ కెప్టెన్ లైసెన్స్ ఉందని, తను దుబాయ్ లో ఓ పెద్ద బోట్ కొనుక్కున్నాను అని ప్రకటించాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఒకప్పుడు అమ్మాయిల మనుసును దోచేసిన హీరో మాధవన్. ఎన్నో లవ్ స్టోరీలతో హిట్స్ కొట్టిన మాధవన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మాధవన్ తనయుడు వేదాంత్ ప్రొఫెషనల్ స్విమ్మర్ కావడంతో అతని కోచింగ్ కోసం ఫ్యామిలీతో సహా దుబాయ్ కి షిఫ్ట్ అయ్యాడు మాధవన్. షూటింగ్స్, ఈవెంట్స్ ఉన్న సమయాల్లో ఇండియాకు వస్తున్నాడు.
Also Read : Thanuja Puttaswamy : మెయిన్ లీడ్లో బిగ్బాస్ తనూజ.. ఆ నటితో కలిసి వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్..
తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. మాధవన్ మాట్లాడుతూ.. నాకు ఎప్పట్నుంచో పడవ నడపాలని ఉండేది. నేను దుబాయ్ కి షిఫ్ట్ అయ్యాక కరోనా సమయంలో బోట్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. బోట్ కెప్టెన్ గా లైసెన్స్ కూడా సంపాదించాను. అందుకు శిక్షణ కోసం బాగా కష్టపడ్డాను. దుబాయ్ లోనే ఒక 40 అడుగుల బోట్ ని కొనుక్కున్నాను. ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్లగలిగే పడవ అది. నేను ఖాళీగా ఉన్నప్పుడు దానిపై సముద్రంలోకి డ్రైవింగ్ కి వెళ్తాను. నేను ఇప్పటివరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఆ బోట్. దాంతో బోట్ నడపాలని నా కోరిక నెరవేరింది అని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం మాధవన్ తన భార్యతో కలిసి ఓ బోట్ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసారు. ఆ బోట్ తనదే అని మాధవన్ తెలిపారు.

