రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్ శృతి హాసన్ తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.
ఈ ఛాలెంజ్‌కు తనని నామినేట్ చేసిన మహేష్, దేవిశ్రీ ప్రసాద్‌లకు శృతి థ్యాంక్స్ తెలుపుతూ తను మొక్కలు నాటుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం ఈ ఛాలెంజ్‌కు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ తమన్నా, రానా దగ్గుబాటిని నామినేట్ చేసింది.