Shruti Haasan : వామ్మో.. శ్రుతిహాసన్ ఈ రేంజ్లో స్టేజి పర్ఫార్మెన్స్.. హాలీవుడ్ సింగర్స్ ని మించిపోయి..
తాజాగా శ్రుతిహాసన్ GQMOTY అనే ఈవెంట్ లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే శ్రుతిహాసన్ పాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారయింది.
- Saketh U
- Published On : November 24, 2023 / 09:15 PM IST
Shruti Haasan Live Stage Singing Performance Video Goes Viral
Shruti Haasan : కమల్ హాసన్ కూతురిగా శ్రుతిహాసన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా సినిమాలు చేయడం మాత్రమే కాదు సింగర్ గా పాటలు పాడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం కూడా అందిస్తుంది. మ్యూజిక్ కూడా ప్రొఫెషనల్ గా తీసుకొని ఈవెంట్స్, స్టేజి షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది శ్రుతిహాసన్.
ఇప్పటికే పలు మ్యూజిక్ ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజి షోలతో మెప్పించింది శ్రుతిహాసన్. రెగ్యులర్ గా తన మ్యూజిక్ అప్డేట్స్ గురించి కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా శ్రుతిహాసన్ GQMOTY అనే ఈవెంట్ లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన లైవ్ పర్ఫార్మెన్స్ తో అక్కడున్న వారందర్ని ఇంప్రెస్ చేసింది.
అయితే శ్రుతిహాసన్ పాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారయింది. ఇందులో శ్రుతిహాసన్ ఓ ఇంగ్లీష్ సాంగ్ ని పాడుతుంది. హాలీవుడ్ స్టార్ సింగర్స్ ని తలదన్నేలా శ్రుతిహాసన్ స్టేజిపై రెచ్చిపోయింది తన పర్ఫార్మెన్స్ తో. దీంతో శ్రుతిలో ఈ కోణం చూడని వాళ్లంతా వామ్మో శ్రుతి ఈ రేంజ్ లో పడుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా శ్రుతిహాసన్ పాడిన వీడియో చూసేయండి మరి.
#ShrutiHaasan rocks out & the crowd goes wild at #GQMOTY2023#GQMOTY #GQIndia pic.twitter.com/YsbSnwfl4C
— GQ India (@gqindia) November 23, 2023
