Devara : ‘దేవర’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన మరాఠీ హీరోయిన్..

‘దేవర’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే. ఆ కామెంట్స్ తో మరో విషయం పై కూడా క్లారిటీ వచ్చేసింది.

Shruti Marathe comments about her role in Devara

Devara : కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కోసం భారీ స్టార్ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

వీరితో ఈ సినిమాలో మరాఠి భామ ‘శృతి మరాఠే’ కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు లేదు. దీంతో ఆ వార్తలన్నీ ఇప్పటివరకు రూమర్స్ గా మిగిలిపోయిని. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ శృతి మరాఠే తన పాత్ర గురించి మాట్లాడారు. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా తెలియజేసారు.

Also read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ వెనుక ఉన్న కథ.. విజయ్‌ని స్టార్‌గా చూపించడం కోసం కాదు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను దేవర సినిమాలో నటిస్తున్నాను. దేవరకి వైఫ్ గా కనిపించబోతున్నాను. ఆ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ తో మరో విషయం పై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అన్న వార్త నిజమే అని తెలుస్తుంది.

కాగా ఈ మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, VFX వర్క్ చాలా ఉండటంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్టుని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ని రూపొందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు