Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ వెనుక ఉన్న కథ.. విజయ్‌ని స్టార్‌గా చూపించడం కోసం కాదు..

'ఫ్యామిలీ స్టార్' టైటిల్ వెనుక ఉన్న కథని తెలియజేసిన దిల్ రాజు. విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడం కోసం..

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ వెనుక ఉన్న కథ.. విజయ్‌ని స్టార్‌గా చూపించడం కోసం కాదు..

Dil Raju viral comments about Vijay Deverakonda Family Star title

Updated On : March 22, 2024 / 8:14 PM IST

Family Star : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టడం వెనుక చాలా కామెంట్స్ వినిపించాయి. విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడం కోసమే ఆ టైటిల్ ని పెట్టారని పలువురు కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా వీటిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ వివరణ ఇచ్చారు.

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. “ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టడం వెనుక కారణం విజయ్ దేవరకొండని స్టార్‌గా చూపించడం కోసం కాదు. మనం అంతా మన ఫ్యామిలీ కోసం కష్టపడుతూనే ఉంటాము. అలా కష్టపడే ప్రతి వ్యక్తి ఒక స్టారే. అందుకనే ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టాము” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Savitri : అహంతో మహానటి సావిత్రిని కోర్టు వరకు లాగిన వ్యక్తి.. దానివల్ల ఆమెను తిట్టారు, కొట్టబోయారు..

కాగా పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ గతంలో ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసారు. దీంతో ఈ మూవీ పై విజయ్ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అండ్ టీజర్ కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. మరి థియేటర్స్ లో రిలీజైన తరువాత ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.