Siddharth emotionalized after seeing famous writer sujatha rangarajan
టాలీవుడ్(Tollywood) లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు(Bommarillu), ఓయ్(Oye).. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు సిద్ధార్థ్(Siddharth). ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేశాడు. ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇస్తూ చేస్తున్నాడు సిద్ధూ. తాజాగా సిద్ధార్థ్ నటించిన టక్కర్ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా టక్కర్(Takkar) సినిమాను తెలుగు, తమిళ్ లో భారీగానే ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో దివ్యంశా కౌశిక్ హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్ లో కొంతమందితో చిట్ చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ పెద్దావిడ రాగా ఆమెను చూసి సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ఆమె స్టేజి మీదకు రాగానే కింద పడి ఆమె కాళ్లకు నమస్కరించాడు. అనంతరం ఆమెను హత్తుకొని ఏడ్చాడు. సిద్ధార్థ్ బాగా ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆమె ఎవరు, సిద్ధార్థ్ ఆమెను చూసి అంతగా ఎందుకు ఎమోషనల్ అయ్యాడు అని నెటిజన్లు, అభిమానులు తెగ ఆలోచించి ఆ కార్యక్రమాన్ని మొత్తం చూస్తున్నారు.
Pawan Kalyan OG : OG నుంచి అదిరిపోయే అప్డేట్..
సుజాత రంగరాజన్ తమిళ్ లో ప్రముఖ రచయిత్రి. పుస్తకాలు, నవలలతో పాటు సినీ పరిశ్రమలో అనేక సినిమాలకు రచయితగా పనిచేసింది. సిద్ధార్థ్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో డైరెక్టర్ శంకర్ బాయ్స్ సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమాలో యువ హీరోలు, కొత్త వాళ్ళని వెతుకుతుంటే సుజాత రంగరాజన్ సిద్ధార్థ్ ని శంకర్ కి పరిచయం చేసింది. మొదట సిద్ధార్థ్ యాక్టింగ్ వైపు రానని చెప్పినా సుజాత ఒప్పించి శంకర్ దగ్గరికి పంపించింది. ఆ తర్వాత బాయ్స్ సినిమా పెద్ద హిట్ అవ్వడం, సిద్ధార్థ్ టాప్ హీరోగా మారడం జరిగాయి. ఇదే చిట్ చాట్ లో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. సుజాత గారు లేకపోతే నా లైఫ్ లేదు. నా 20 ఏళ్ళ కెరీర్ లేదు. ఆమె వల్లే నేను స్టార్ అయ్యాను అని తెలిపారు. ఆమెని చాలా సంవత్సరాల తర్వాత చూడటం వల్లే ఎమోషనల్ అయినట్టు తెలిపారు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కింద పడి ఆమె కాళ్లకు నమస్కారం పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
She's Sujatha,and she only recommended actor siddharth to director shankar for boys movie…?♥️#Siddharth #takkar pic.twitter.com/e5s5n9PEYc
— sridhar (@sridharaano1) June 8, 2023