Siddhu Jonnalagadda
Siddhu Jonnalagadda : ఇటీవల పలు జర్నలిస్టులు హద్దులు దాటి మారి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడుగుతున్నారు. రీసెంట్ గా తెలుసు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సిద్ధూ జొన్నలగడ్డని ఓ లేడీ జర్నలిస్ట్ మీరు సినిమాలో బయట కూడా లాగా స్త్రీ లోలుడా(వుమనైజర్)? బయట కూడా ఇద్దరు అమ్మాయిలని ఒకేసారి లవ్ చేస్తారా అంటూ నెగిటివ్ గా ప్రశ్నించింది. దీంతో అది కాస్తా వైరల్ అయింది.(Siddhu Jonnalagadda)
నిన్నే ఆ లేడీ జర్నలిస్ట్ కి.. ఇది నా ఇంటర్వ్యూనా సినిమా ఇంటర్వ్యూనా అని కౌంటర్ ఇచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా నేడు మీడియాతో మాట్లాడుతూ మరోసారి దీని గురించి ప్రస్తావన రాగా సిద్ధూ దీనిపై స్పందిస్తూ ఫైర్ అయ్యాడు.
Also Read : Duvvada Srinivas : మాధురికి వచ్చే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏం చేస్తానంటే.. దువ్వాడ కామెంట్స్..
సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అలా మాట్లాడటం అగౌరవం. మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకా అలా మాట్లాడి నవ్వుతున్నారు. అలాంటి దానికి ఇంక నేను ఏం సమాధానమిస్తాను. అందుకే అవాయిడ్ చేశాను. హీరో సినిమాలో పోలీస్ అయితే బయట కుడా పోలీస్ గా చేస్తారా. సినిమాకి బయటకి తేడా తెలీదా. మన చేతిలో మైక్ ఉందని, స్టేజిపై వాళ్ళు ఉన్నారని అలా అనడం కరెక్ట్ కాదు. అది వాళ్లకు వాళ్ళు రియలైజ్ అవ్వాలి.
నిన్న నన్ను ఆ ప్రశ్న ఎవరు అడిగారో ఆమె ఎవరో కూడా నాకు తెలీదు. ఆమె ఈవెంట్ కి ముందు పద్దతిగా నన్ను ఇంటర్వ్యూ ఇమ్మని అడిగింది. ఇక్కడ మైక్ తీసుకోగానే మారిపోయింది. అది మంచి వాతావరణం కాదు, మంచిది కాదు. అయినా నన్ను అడగడం కాదు అలాంటి మాటలు అనేవాళ్లను అడగండి ఎందుకు అన్నారో. ఇలాంటివి నేను సీరియస్ గా తీసుకోను. అలాంటి వాటికి అటెన్షన్ ఇవ్వడం నచ్చదు. ఏదో ఒక రోజు వాళ్ళే తాము చేసింది తప్పు అని రియలైజ్ అవుతారు. సీనియర్ జర్నలిస్టులు మర్యాదగా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఉండటం కరెక్ట్ కాదు. నేను అందరితో బాగుండాలని అంటాను. వాళ్ళే ప్రదీప్ ని కూడా ఏదో అడిగారు, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటి మీద ఆలోచించడం కూడా వేస్ట్. ఇలాంటి ప్రశ్నల వల్ల నేను ఇబ్బంది పడను, ఫీల్ అవ్వను. స్ట్రాంగ్ గా ఉంటాను అని అన్నారు.
Also See : Suhana Khan : షారుఖ్ కూతురు.. చీరకట్టులో సుహానా ఖాన్ సొగసు చూడతరమా..