Siddhu Jonnalagadda
Siddhu Jonnalagadda : సాధారణంగా హీరోల డేట్స్ ఇస్తే సినిమాలు చేస్తామని దర్శక నిర్మాతలు అంటారు. అయితే తాజాగా హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోయిన్స్ డేట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. సిద్ధూ తెలుసు కదా సినిమాతో అక్టోబర్ 17 రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సిద్ధూ. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేనే అక్కడ ఉంటా. నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను. శ్రీనిధి శెట్టి డేట్స్ కావాలని నేనే ఫోన్ చేయమని అంటాను. రాశీఖన్నా డేట్స్ కావాలని నేనే ఫోన్ చేయమని అంటాను. హీరోది ఏముంది. హీరో ఒకేసారి ఒక సినిమానే చేస్తాడు. హీరోయిన్స్ అయిదారు సినిమాలు చేస్తారు ఒకేసారి. యాక్చువల్ గా హీరోయిన్స్ డేట్స్ కోసం హీరోలే ఎదురుచూస్తారు. ఇదే రియాలిటీ,. నేను ఒక టైంలో ఒకే సినిమా చేస్తాను అని అన్నారు. దీంతో సిద్ధూ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.