Siddhu Jonnalagadda Jack Trailer Out now
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో కథానాయిక. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, కిస్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Chiranjeevi : అనిల్ కోసం చిరు మరోసారి..!
3 నిమిషాల 7 సెకన్లు ఈ ట్రైలర్ ఉంది. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాలు, సిద్ధు తనదైన కామెడీతో అలరించాడు. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.