×
Ad

Siddhu Jonnalagadda : ఆ రెండు సినిమాలు ఆగిపోయాయి.. సిద్దు ఫ్యాన్స్ కి షాక్.. నాగవంశీ కామెంట్స్ వైరల్..

డీజే టిల్లు కాకుండా సిద్ధూ తీసిన జాక్, తెలుసు కదా సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆడలేదు.(Siddhu Jonnalagadda)

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉండి, ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ కొట్టి సిద్ధూ కి సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చింది. దానికి సీక్వెల్ కూడా తీసి మళ్ళీ సక్సెస్ కొట్టాడు. అయితే డీజే టిల్లు కాకుండా సిద్ధూ తీసిన జాక్, తెలుసు కదా సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆడలేదు.(Siddhu Jonnalagadda)

సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా తర్వాత కోహినూర్ అనే పాన్ ఇండియా సినిమా, బ్యాడ్ యాస్ అనే యాక్షన్ సినిమా ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి అని షాకింగ్ న్యూస్ చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఈ రెండు సినిమాలు నాగవంశీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ప్రకటించారు.

Also See : Amrutha Chowdary : థాయిలాండ్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న అమృత చౌదరి.. ఫొటోలు వైరల్..

తాజాగా నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహినూర్, బ్యాడ్ యాస్ రెండు సినిమాలు ఆగిపోయాయి. కొత్త డైరెక్టర్ తో సిద్ధూ హీరోగా కొత్త ఎంటర్టైన్మెంట్ సినిమా ఓకే చేసాము. రెండు రోజుల కిందే సినిమా ఓకే అయింది. త్వరలో అనౌన్స్ చేస్తాము. తనను ప్రేక్షకులు డీజే టిల్లు పాత్ర లాంటి ఎంటర్టైన్ పాత్రల్లోనే చూస్తున్నారు. అందుకే సిద్దు అలాగే చేయాలి అనుకున్నాడు. సిద్ధునే కొన్ని రోజులు ఆలోచించుకొని కోహినూర్ సినిమా వద్దు అన్నాడు. సగం సగం నమ్మి మిమ్మల్ని ఇందులోకి దింపలేను అని అన్నాడు. బ్యాడ్ యాస్ సినిమా కొన్ని సినిమాల తర్వాత చేస్తాడు అని తెలిపారు.

దీంతో సిద్ధూ జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఎన్నో అంచనాలు నెలకొన్న కోహినూర్ సినిమా ఆగిపోయింది అని చెప్పడంతో సిద్ధూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి కోహినూర్ భవిష్యత్తులో అయినా చేస్తాడేమో చూడాలి.

Also Read : Nagavamsi : పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయింది.. తెలంగాణలో జీవో ఉంది.. ఆంధ్రాలో లేదు..