Badass: బ్యాడాస్ మూవీ టీం కాస్టింగ్ కాల్.. సిద్దు జొన్నలగడ్డతో నటించే అవకాశం

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Badass). ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ సినిమా చేసి ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Siddu Jonnalagadda Badass Movie Team Casting Call

Badass: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ సినిమా చేసి ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి తనకు అచ్చొచ్చిన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో మరో సినిమా చేస్తున్నాడు. అదే బ్యాడాస్(Badass). క్ష‌ణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బ‌బుల్‌గ‌మ్ చిత్రాల‌ ఫేమ్ దర్శకుడు ర‌వికాంత్ పేరెపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Sandeep Reddy Vanga: జస్ట్ ఎమోజీ షేర్ చేశాడు అంతే.. సోషల్ మీడియా షేక్ అయ్యింది.. సందీప్ రెడ్డి మామూలోడు కాదు!

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. యాక్టింగ్ పై ఉంది తెలుగు మాట్లాడగలిగే వారు ఆడిషన్స్ కి అటెంట్ అవ్వాలని కోరారు. తండ్రి పాత్ర కోసం 40 నుంచి 60 ఏండ్ల మధ్య వ‌య‌సున్న వారు, 20 నుంచి 60 ఏండ్ల వ‌య‌సున్న మేల్ ఆర్టిస్టులు, 20 నుంచి 60 ఏళ్ళ వయసున్న ఫిమేల్ ఆర్టిస్టులు,13 నుంచి 15 ఏళ్ళ వయసున్న యువ‌కులు ఈ ఆడియన్స్ హాజరవ్వాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, నటనకు సంబంధించిన వీడియోలను badassfilmcasting@gmail.com మెయిల్ ఐడీకి లేదా +91 9502619987 వాట్సాప్ నంబర్‌ కు పంపించాలని తెలిపారు.