Sidharth Malhotra – Kiara Advani : పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో బాలీవుడ్ ప్రేమ జంట..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉందంటూ, వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిరుద్దరు పెళ్లితో ఒకటి కాబోతున్నారట. ఈ నెల..

Sidharth Malhotra – Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ‘భారత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కియారా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, ఇప్పుడు RC15 సినిమాలో నటిస్తుంది. కాగా ఈ అమ్మడు మరో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది అంటూ బి-టౌన్ లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉందంటూ, వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

Kiara Advani : కియారా సినిమాలోకి రావడానికి.. ఆ స్టార్ హీరో హెల్ప్ చేసాడట!

కానీ వాటిపై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. ‘షేర్షా’ సినిమాతో మొదటి సారి కలిసి పని చేసిన కియారా, సిద్దార్ద్.. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిరుద్దరు పెళ్లితో ఒకటి కాబోతున్నారట. ఈ నెల 6వ తారీఖున రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్దార్ద్ పెళ్లి చేసుకోబోతున్నారు. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్స్ జరగనున్నాయి అంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అన్ని నిజమంటూ కన్‌ఫార్మ్ చేసింది ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సంస్థ వైరల్ భయానీ.

వైరల్ భయానీ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.. ‘ఫిబ్రవరి 4-6 వరకు జరిగే కియారా-సిద్దార్ద్ వివాహాన్ని కవర్ చేయడానికి తమ టీం జైసల్మేర్‌కు బయలుదేరుతుందని’ అని వెల్లడించింది. దీంతో కొన్ని రోజులుగా ఉన్న వీరి ప్రేమ రూమర్లకు తెర పడింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే హాజరు కానున్నారు. బాలీవుడ్ లో వరుసపెట్టి ప్రేమజంటలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్, నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి భారత్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు