Kiara Advani : కియారా సినిమాలోకి రావడానికి.. ఆ స్టార్ హీరో హెల్ప్ చేసాడట!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నార్త్ టు సౌత్ సినిమా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ ఏడాది ఈ అందాల భామ నటించిన 'జగ్ జుగ్ జీయో', 'భూల్ భులైయా-2', ఓటిటిలో విడుదలైన 'గోవిందా నామ్ మీరా' సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. వీటితో పాటు మరో రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించి అలరించింది. కాగా ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక స్టార్ హీరో హెల్ప్ చేశాడు అంటా.

Kiara Advani : కియారా సినిమాలోకి రావడానికి.. ఆ స్టార్ హీరో హెల్ప్ చేసాడట!

Amir Khan helped Kiara to enter the film

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నార్త్ టు సౌత్ సినిమా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ ఏడాది ఈ అందాల భామ నటించిన ‘జగ్ జుగ్ జీయో’, ‘భూల్ భులైయా-2’, ఓటిటిలో విడుదలైన ‘గోవిందా నామ్ మీరా’ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. వీటితో పాటు మరో రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించి అలరించింది. కాగా ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక స్టార్ హీరో హెల్ప్ చేశాడు అంటా.

Kiara-Sidharth : కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారా??

ఇటీవల ఒక హిందీ టాక్ షోలో పాల్గొన్న కియారా.. సినిమా తన జీవితంలో ఎటువంటి పాత్ర పోషిందో చెప్పుకొచ్చింది. “ఎవరి తల్లిదండ్రులైనా తమ బిడ్డ సినిమాలోకి వెళ్తాను అంటే భయపడతారు. మా పేరెంట్స్ కూడా అలాగే ఆలోచించారు. అయితే ఒకరోజు నేను, మా నాన్న కలిసి అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమాకి వెళ్ళాము. ఆ సినిమా చూసిన తరవాతే మా అమ్మానాన్నలు సినిమాలోకి వెళ్ళడానికి అంగీకరించారు” అంటూ వెల్లడించింది.

ప్రస్తుతం తెలుగులో కియారా, రామ్ చరణ్ సినిమాలో నటిస్తుంది. RC15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్, కియారా అద్వానీ పై ఒక పాటని శంకర్ తన స్టైల్ అఫ్ మేకింగ్ లో భారీగా చిత్రీకరించాడు.