Singeetham Srinivasarao : చిత్ర పరిశ్రమలో విషాదం.. లెజెండరీ డైరెక్టర్ సతీమణి కన్నుమూత..
సీనియర్, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు................
- Saketh U
- Published On : May 29, 2022 / 11:03 AM IST
Singeetham
Singeetham Srinivasarao : సీనియర్, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది. ఆయన సినీ కెరీర్‌లో ఆమె కూడా కీలక పాత్ర పోషించారు. పలు సినిమాలకు స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. భార్య కోసం సింగీతం శ్రీనివాసరావు ఏకంగా ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు.
SSMB28 : త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో నందమూరి హీరో.. మళ్ళీ విలన్‌గా..
ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయన భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి చికిత్స తీసుకుంటూ చెన్నై హాస్పిటల్ లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా.. నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది అని మీడియాకి తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
