మాళవికతో పాటు ఫ్యామిలీకి కూడా పాజిటివ్..

  • Publish Date - August 20, 2020 / 03:06 PM IST

Singer Malavika Tested Covid-19 Positive: ప్రపంచవ్యాప్తంగా కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎన్ని నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇటీవల సింగర్స్ సునీత, మాళవికలు కరోనా బారిన పడ్డారు. సునీత ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు. తాజాగా మాళవిక తనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్థారణ అయినట్లు చెప్పారు. తనతో సహా తన రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు కూడా కొవిడ్‌-19 బారిన పడ్డారని ఆమె చెప్పారు.



‘‘జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌లు చేయించుకున్నా. ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. మా అమ్మాయి, అమ్మానాన్నల్లో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు కానీ టెస్ట్ చేస్తే వారికీ పాజిటివ్ వచ్చింది. మందులు వేసుకోవడంతో పాటు ప్రతిరోజూ ప్రాణాయామం ప్రాక్టీస్‌ చేస్తున్నా. మేమంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాం’’ అని మాళవిక అన్నారు. ఈ కష్ట సమయంలో తన భర్త కృష్ణ చైతన్య ఎంతో మద్దతు ఇస్తున్నారని ఆమె తెలిపారు.