Singer Mangli played Throwball in Isha Gramotsavam 2024 video goes viral
Singer Mangli : ప్రముఖ సింగర్ మంగ్లీ గురించి పరిచయం అవసరం లేదు. ముందు ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన సింగర్ మంగ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ సింగర్ అయిపోయింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కూడా సాంగ్స్ పాడింది. ఇప్పటికీ ప్రైవేట్ సాంగ్స్, ఈవెంట్స్, షోస్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
Also Read : Pushpa 2 : లండన్ లో పుష్ప హవా.. లండన్ వీధుల్లో బన్ని ఫ్యాన్స్ డ్యాన్స్..
అయితే తాజాగా ఈమె ఈషా గ్రామోత్సవం 2024 లో పాల్గొంది. ఈషా ఫౌండేషన్ 2004 నుంచి గ్రామోత్సవం కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పటి వరకూ 30వేల గ్రామాల్లో నిర్వహించారట. గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు, వినోదంతో పాటు, అంతరించిపోతున్న సంప్రదాయ కళలను లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సంవత్సరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగ్లీ వచ్చింది. ఇందులో భాగంగానే త్రోబాల్ ఆడింది. చీరకట్టుకొని ఎంతో ఎనర్జీ తో స్కూల్ పిల్లలకి పోటీగా త్రోబాల్ ఆడింది. తన ఆటని చూసి అక్కడున్న జనాలు షాక్ అయ్యారు. దీంతో మంగ్లీ వీడియో వైరల్ గా మారింది.