Pushpa 2 : లండన్ లో పుష్ప హవా.. లండన్ వీధుల్లో బన్ని ఫ్యాన్స్ డ్యాన్స్..
పుష్ప రాజ్ కి కేవలం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

Allu Arjun Fans dance on pushpa 2 movie song in London
Pushpa 2 : మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమా పుష్ప 2 మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా చేస్తున్నారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
Also Read : Unstoppable with NBK S4 : శ్రీలీల, నవీన్ పోలిశెట్టి అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది..
అయితే పుష్ప రాజ్ కి కేవలం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ లండన్ ఫ్యాన్స్ బన్నీకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. బన్నీ ఫాన్స్ కొందరు లండన్ వీధుల్లో పుష్ప సినిమాలోని ‘పుష్ప పుష్ప రాజ్’ హిందీ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. తమ డాన్స్ తో బన్నీ పై ఉన్న అభిమానాన్ని చాటారు.
View this post on Instagram
అలా ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ వీడియో పై స్పందించారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ వీడియోని రీ షేర్ చేస్తూ..”లండన్ వీధుల్లో ఇండియన్ బిగ్గెస్ట్ సినిమా పుష్ప 2.. పుష్ప పాటకి డాన్స్ చేస్తూ లండన్ వీధుల్లో ఫ్యాన్స్ తమ ప్రేమను చూపించారు” అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.