Unstoppable with NBK S4 : శ్రీలీల, నవీన్ పోలిశెట్టి అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది..
రోజు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.

Sreeleela and Naveen Polishetty unstoppable promo released
Unstoppable with NBK S4 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆడియన్స్ ను ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకున్న ఈ షో నుండి నిన్న ఆరవ ఎపిసోడ్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి ఈ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వచ్చారు.
Also Read :Vikrant Massey : కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో..
కాగా ఈ రోజు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ ప్రోమోలో బాలయ్యతో చిందులు వేశారు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి. బాలయ్య ఎనర్జీ ని మ్యాచ్ చేస్తూ శ్రీలీల కూడా బాగానే ఆకట్టుకుంది. తమ సినిమాలకి సంబందించిన పలు విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పటికే బాలయ్య, శ్రీలీల కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ప్రోమో మీరు కూడా చూసెయ్యండి.
అలాగే శ్రీలీల, నవీన్ పోలిశెట్టితో బాలయ్య కొన్ని గేమ్స్ కూడా ఆడించారు. కొందరు నటీ, నటుల గురించి కూడా ప్రశ్నలు అడిగారు. అనంతరం బాలయ్యతో పుష్ప 2 కిస్సిక్ సాంగ్ కి స్టెప్పులు కూడా వేసింది శ్రీలీల. వీణ కూడా వాయించింది. అలా మొత్తానికి సరదా సరదాగా సాగింది ప్రోమో.