Vikrant Massey : కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో..
12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే గురించి చాలా మందికి తెలిసిందే.

12th movie hero Fail Vikrant Massey gave a break to movies
Vikrant Massey : 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే గురించి చాలా మందికి తెలిసిందే. 12th ఫెయిల్ సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ నటుడు ధూమ్ మచావో ధూమ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 12th ఫెయిల్ సినిమాతో ఉత్తమ నటుడిగా కూడా అవార్డు తెచ్చుకున్నాడు ఈ నటుడు.
Also Read : తీవ్ర విషాదం.. బుల్లితెర నటి శోభిత బలవన్మరణం…
విక్రాంత్ మాస్సే 2019లో నటి శీతల్ ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇన్ని సంవత్సరాల నుండి వరుస సినిమాలు చేసి బిజీగా ఉన్న ఈ నటుడు తాజాగా తన అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చారు. తన సినిమా కెరీర్ కి బ్రేక్ ఇచ్చాడు. దీనికి సంబందించిన ఓ పోస్ట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక పోస్ట్ లో “గత కొన్ని సంవత్సరాలుగా మీరందరూ అందిస్తున్న సపోర్ట్ కి ప్రేమకి ధన్యవాదాలు. కానీ ఈ ప్రయాణంలో నాకు తెలిసింది ఏంటంటే.. నేను ఒక భర్తగా, కొడుకుగా, తండ్రిగా తిరిగి ఇంటికి వెళ్లాలని. 2025లో మనం చివరిసారి కలుసుకుందాం. కొద్దీ గ్యాప్ తర్వాత టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం.. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలతో పాటు నేను చేస్తున్న ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి. నన్ను సపోర్ట్ చేసినందుకు మరొక్కసారి అందరికీ థాంక్స్” అని తెలిపారు.
View this post on Instagram
ఇక ఇటీవల ఆయన సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. నవంబర్ 15న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.