Singer Mano : ప్రముఖ అమెరికా యూనివర్సిటీ నుంచి సింగర్ మనోకు డాక్టరేట్..

తాజాగా సింగర్ మనో డాక్టరేట్ అందుకున్నారు. 38 ఏళ్లుగా దాదాపు 25 వేల పాటలు, 15 భాషల్లో సాంగ్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సేవలు అందించినందుకు సింగర్ మనోకు అమెరికాకు చెందిన Richmond Gabriel University డాక్టరేట్ అందించింది.

Singer Mano :  తన పాటలతో తెలుగు, తమిళ వాళ్ళని మెప్పించిన సింగర్ మనో. దాదాపు 38 ఏళ్లుగా సింగర్ మనో తన పాటలతో మెప్పిస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో ఎక్కువ పాటలు పాడినా భారతదేశంలోని 15 భాషల్లో కూడా మనో పాటలు పాడారు. సింగర్ గా ఓ వైపు ప్రేక్షకులని మెప్పిస్తునే మరోవైపు ప్రముఖ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా సినిమాలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి టెలివిజన్ రంగంలో కూడా పలు టీవీ షోలకు జడ్జిగా హాజరవుతున్నారు.

తాజాగా సింగర్ మనో డాక్టరేట్ అందుకున్నారు. 38 ఏళ్లుగా దాదాపు 25 వేల పాటలు, 15 భాషల్లో సాంగ్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సేవలు అందించినందుకు సింగర్ మనోకు అమెరికాకు చెందిన Richmond Gabriel University డాక్టరేట్ అందించింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు.

సింగర్ మనో డాక్టరేట్ అందుకున్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇండియన్ సంగీత పరిశ్రమలో దాదాపు 38 ఏళ్లుగా 25 వేల సాంగ్స్, 15 భాషల్లో పాడినందుకు గాను Richmond Gabriel University నాకు గౌరవ డాక్టరేట్ అందించారు. నా ప్రయాణంలో సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు