Singer Pranavi : ‘ప్రెగ్నెన్సీలో నా గొంతు పోయింది.. కనీసం పాపకి కూడా’.. సింగర్ ప్రణవి వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ప్రణవి. ఎన్నో పాటలు పాడింది.

Singer Pranavi shared about her Pregnancy journey
Singer Pranavi : సినీ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ప్రణవి. ఎన్నో పాటలు పాడింది. స్టార్ హీరో సినిమాల దగ్గర నుండి పలు చిన్న సినిమాల వరకు చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ జంటకి ఒక పాప కూడా ఉంది.
అయితే చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు ఈ కపుల్. ఇందులో తమ వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా తెలిపారు. కాగా ఇందులో సింగర్ ప్రణవి ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది.. ఇందులో ఆమె మాట్లాడుతూ..” ప్రెగ్నెన్సీ తర్వాత నా వాయిస్ పోయింది. పాప పుట్టిన తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పాడలేకపోయాను, ఆ తర్వాత కూడా పాడలేనేమో అనుకున్నా.. అందుకే రికార్డింగ్స్ కి కూడా వెళ్ళలేదు. కనీసం పాపని పడుకోబెట్టడానికి కూడా గొంతు రాలేదని.. అప్పుడు అసలు ఈ జీవితమే వేస్ట్ అని అనిపించిందని చెప్పుకొచ్చింది.
Also Read : Pushpa 2 : పాటల్లోనూ పుష్ప ప్రభంజనం.. అప్పుడలా.. ఇప్పుడిలా..
అలా కొంతకాలం తర్వాత మళ్లీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసానని తెలిపింది. మా పాపకి జోలపాట పాడకపోతే అస్సలు పడుకోదు. తన కోసమైనా రోజు పాటలు పాడతాను. తనకి అన్ని పాటలు పాడడం వచ్చు. అన్ని పాటలు వింటుంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.