అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘సూర్యవంశీ’ లో అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు..
సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ కలిసి కనిపిస్తే ఎలా ఉంటుంది.. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది కదూ! అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబోలో రూపొందుతున్న ‘సూర్యవంశీ’ సినిమా కోసం సింగిల్ ఫ్రేమ్‌లో.. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్‌లను సెట్ చేశాడు దర్శకుడు. కత్రినా కైఫ్ హీరోయిన్ కాగా, అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు.
అజయ్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్.. అక్షయ్‌ని ‘సూర్యవంశీ’గా చూపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. క్లైమాక్స్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ కోసం ఆర్ఎఫ్‌సీలో సెట్ వేశారు. రీసెంట్‌గా అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్షయ్‌తో పాటు వీరిద్దరు కూడా పోలీస్ యూనిఫామ్‌లో కనిపించారు. వీరిద్దరూ షూట్‌లో జాయిన్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది మూవీ టీమ్..
Read Also : ఆత్మ మీ పాపనేదో చేసింది : ఆసక్తి రేపుతున్న ‘ఆవిరి’ ట్రైలర్
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్ శెట్టి పిక్చర్స్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థలు నిర్మిస్తున్న ’సూర్యవంశీ’ 2020 మార్చి 27న విడుదల కానుంది. మ్యూజిక్ : హిమేష్ రేష్మియా, తనిష్క్ బాగ్చీ, గురు రంధావా, సినిమాటోగ్రాఫీ : జోమోన్ టి.జాన్, నిర్మాతలు : హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అరుణ భాటియా, అపూర్వ మెహతా, రోహిత్ శెట్టి.
#Singham. #Simmba. #Sooryavanshi. Ajay Devgn, Akshay Kumar and Ranveer Singh in #Sooryavanshi… Directed by Rohit Shetty. pic.twitter.com/SRYhDkDSlC
— taran adarsh (@taran_adarsh) October 10, 2019