Site icon 10TV Telugu

Sir Movie : నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న సార్.. తెలుగు, తమిళ్ రెండూ ట్రెండ్ లోనే..

Sir Movie trending in Netflix with tamil and telugu version

Sir Movie trending in Netflix with tamil and telugu version

Sir Movie :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్. తమిళ్ లో వాతి పేరుతో తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ సినిమాగా ఒకేసారి రిలీజయింది. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి చెప్పడం, మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించడం, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా భారీ హిట్ అయింది.

ధనుష్ సార్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవ్వడంతో పాటు, కంటెంట్ కూడా అందరికి నచ్చడంతో కలెక్షన్స్ కూడా బారాయిగా వచ్చాయి. మూడు రోజుల్లోనే సార్ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ సాధించి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. సార్ సినిమా మొత్తం థియేటర్ రన్ లో 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

#TuJhoothiMainMakkaar : మొత్తానికి బాలీవుడ్ లో.. ఇంకో 100 కోట్ల సినిమా.. సక్సెస్ కొట్టిన రణబీర్ కపూర్..

ఇక సార్ సినిమా ఇటీవల మార్చ్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఇన్నాళ్లు థియేటర్స్ లో అదరగొట్టిన సార్ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తమిళ్ వాతి టాప్ పొజిషన్ లో ఉండగా, తెలుగు సార్ సెకండ్ పొజిషన్ లో ఉంది. రెండు భాషల్లోనూ సార్ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరోసారి ధనుష్ ఫుల్ సక్సెస్ సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version