Siri Sunny
Bigg Boss 5 : బిగ్ బాస్ మరో రెండు రోజుల్లో అయిపోతుంది. దీంతో మరింత ఆసక్తిగా మారింది షో. ఇక చివర్లో ఇచ్చే టాస్కులు కూడా పాత టాస్కులే ఇస్తున్నాడు. ఈ టాస్కుల్లో ఉన్న అయిదుగురిలోనే మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు చాలా టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్కుల్లో సిరి ఓడిపోవడంతో సన్నీ సిరిని ఇమిటేట్ చేస్తూ బాగా ఇరిటేట్ చేశాడు. లాస్ట్ లో ఐదో టాస్కులో కూడా సిరి ఓడిపోవడంతో మళ్ళీ ఇదే పని చేశాడు సన్నీ.
ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. దీంతో ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సిరిని వెక్కిరించాడు. దీంతో సిరికి కోపం వచ్చింది. నువ్వే ఓడిపోయావ్ షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. తర్వాత సన్నీ కవర్ చేసుకోవడానికి నేను జోక్‌గా అన్నానని చెప్పాడు. ఓడిపోయావ్ అని వెక్కిరించడం జోక్ అవ్వదు అని సిరి కోపంగానే ఉంది. మజాక్‌గా అన్నానని చెప్పి సిరిని కన్వీన్స్ చేయడానికి ట్రై చేశాడు సన్నీ. కానీ సిరి మాత్రం సీరియస్ గానే ఉంది. తినే టైంకి తిందాం రమ్మని పిలవడంతో సిరికి మరింత కోపం వచ్చి సన్నీ మీద అరిచేసింది.
Bigg Boss 5 : బిగ్‌బాస్ లో ఏం జరుగుతుందో మీకు తెలీదు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి : యాని మాస్టర్
పక్కనోడు గెలిస్తే సహించలేవు. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. సిరి అరవడంతో సన్నీ మళ్ళీ ఆమెను ఇమిటేట్ చేయడంతో సిరి మరింత సీరియస్ అయింది. సన్నీ దగ్గరికి వచ్చి ప్రతిసారి ఇమిటేట్ చేస్తావేంటి? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ ఇప్పుడేమో తినమని పిలుస్తున్నావా అంటూ సీరియస్ గా సన్నీ పై ఫైర్ అయింది సిరి. తర్వాత సన్నీ ఈ విషయాన్ని మానస్ దగ్గర చర్చించాడు,