Siri Hanumanthu : కారు కొన్న బిగ్‌బాస్ సిరి.. ప్రియుడితో కలిసి ఫోజులు..

ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉన్న సిరి తాజాగా ఓ ఖరీదైన కారుని కొంది. 20 లక్షలు పెట్టి MG హెక్టర్ కారుని కొంది సిరి హన్మంతు. కారుని కొనేటప్పుడు తన ప్రియుడు..........

Siri Hanumanthu

Siri Hanumanthu :  సిరి హన్మంత్‌.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఛాన్స్ కొట్టేసి బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్‌-5లో షణ్ముఖ్ తో కలిసి రచ్చ చేసి బాగా వైరల్ అయింది. షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి ఒకరకంగా సిరినే కారణం అని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సిరి తన ప్రియుడు శ్రీహన్ తో కూడా విడిపోయింది అని వార్తలు వచ్చాయి. దీంతో చాలా రోజులు వార్తల్లో నిలిచింది సిరి హన్మంత్. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసి వాళ్ళ బంధంపై క్లారిటీ ఇచ్చింది.

New Movies : సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తున్న యువ హీరోలు..

ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉన్న సిరి తాజాగా ఓ ఖరీదైన కారుని కొంది. 20 లక్షలు పెట్టి MG హెక్టర్ కారుని కొంది సిరి హన్మంతు. కారుని కొనేటప్పుడు తన ప్రియుడు శ్రీహన్ కూడా పక్కనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి కార్ కీస్ ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి కార్ వద్ద ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీహాన్‌ కూడా సిరి కొత్త కారు కొన్న ఫోటోలని పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ.. ముందు డ్రైవింగ్‌ నేర్చుకో సిరి అంటూ సరదాగా కౌంటర్‌ వేశాడు. సిరికి సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు పలువురు నెటిజన్లు, ప్రముఖులు.