Sitara Ghattamaneni : సితార పాప దసరా స్పెషల్ డ్యాన్స్ చూశారా.. ఎంత బాగా చేసిందో..

తాజాగా దసరా పండగ సందర్భంగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. సితార ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్ వీడియోల్ని పోస్ట్ చేసింది.

Sitara Ghattamaneni Dasara Special Dance Video Goes Viral

Sitara Ghattamaneni :  మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార అందరికి పరిచయమైనా గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇటీవల ఓ యాడ్ కూడా చేసి మెప్పించింది. తండ్రి బాటలోనే కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది.

ఇక సితార చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటుంది. ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా దసరా పండగ సందర్భంగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. సితార ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్ వీడియోల్ని పోస్ట్ చేసింది. అనీ మాస్టర్ దగ్గర సితార డ్యాన్స్(Dance) నేర్చుకుంటుంది.

Also Read : Bigg Boss 7 Day 50 : నామినేషన్స్ తో హౌస్ లో ఫైర్.. రతికకు స్పెషల్ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్..

దసరా(Dasara) సందర్భంగా ఓ హిందీ పాటకు సితార పాప ఇంకో ఇద్దరితో, అనీ మాస్టర్ తో కలిప్స్ ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసి అలరించింది. ఆ డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో అందరూ సితార పాపని అభినందిస్తున్నారు. ఎంత బాగా డ్యాన్స్ వేసిందో, ఎంత క్యూట్ గా ఉందో, పద్దతిగా, సాంప్రదాయంగా రెడీ అయింది అని, చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అప్పుడప్పుడు సితార ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే మంచి పేరు తెచ్చుకుంటుంది.