Sitara Ghattamaneni emotional post on Mahesh Babu Krishna
Sitara Ghattamaneni : మహేష్ బాబు కూతురు సితార.. సోషల్ మీడియాలో నిత్యం ట్రేండింగ్ లో ఉంటుంది. ఈమధ్య తన హెల్పింగ్ నేచర్ తో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తాజాగా సితార తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు వేసింది. నేడు (అక్టోబర్ 13) నేషనల్ సినిమా డే కావడంతో.. తన కుటుంబ సినిమా జీవితం గురించి ప్రస్తావిస్తూ ఒక పోస్టు వేసింది.
“సినిమా అనేది నా జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాకు అది కేవలం ఒక ఇండస్ట్రీ కాదు. నా DNAలోనే సినిమా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నా తండ్రి ఒక సూపర్ స్టార్, నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అలాగే మా తాత సూపర్ స్టార్ కృష్ణ మా నాన్నకి అదే స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ప్రయాణం మా జీవితాలకి ఎంతో ప్రభావితం అయ్యింది. ఇలాంటి వారసత్వంలో నేను భాగం అయ్యినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను” అంటూ పేర్కొంది. అలాగే ఇన్నాళ్లు తమని సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ చెబుతూ.. నేషనల్ సినిమా డే విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
Also read : JanaSena: ఇక భరించలేనంటూ జనసేనకు రాజీనామా చేసి.. 24 గంటల్లోనే వైసీపీలో చేరిన కీలక నేత
కాగా సితార ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ తో చిన్న వయసులోనే మోడల్ గా మారిపోయింది. మొన్నటి వరకు తండ్రి మహేష్ తో కలిసి యాడ్స్ చేసిన సితార.. ఇప్పుడు సింగల్ గా కమర్షియల్ యాడ్స్ చేస్తూ తన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకొస్తుంది. సితార హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇస్తుందని మహేష్, నమ్రత ఎప్పుడో తెలియజేశారు. సితార వేగం చూస్తుంటే.. గౌతమ్ కంటే ముందే వెండితెర అరంగేట్రం చేసినా ఆశ్చర్యపడనవసరం లేదు.