Sitara Ghattamaneni : దీపావళికి ముగ్గులు వేస్తున్న సితార పాప.. క్యూట్ గా దివాళి స్పెషల్ ఫోటోలు..

సితార చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.

Sitara Ghattamaneni Special Photos Shared on Diwali

Sitara Ghattamaneni : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార అందరికి తెలిసినా గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.

ఇక ఇటీవల ఓ యాడ్ కూడా చేసి మెప్పించింది. తండ్రి బాటలోనే కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది సితార. చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.

Also Read : Bigg Boss 7 Day 69 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మరోసారి శివాజీకి సపోర్ట్ చేస్తున్నట్టు బయటపడిన నాగ్

తాజాగా దీపావళి సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసింది. తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ముగ్గులు వేసింది. సితార ముగ్గులు వేస్తున్న ఫోటోలని, తాను వేసిన ముగ్గుని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే గాగ్రా చోళీ డ్రెస్ లో దీపం పట్టుకొని దీపావళికి స్పెషల్ ఫోటోలు కూడా ముందే పోస్ట్ చేసింది సితార. ఇక రాత్రికి దీపావళి సెలెబ్రేట్ చేసుకునే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుందని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అభిమానులు, ఫాలోవర్లు కామెంట్స్ లో సితార పాపకి హ్యాపీ దీపావళి చెప్తున్నారు.