Bigg Boss 7 Day 69 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మరోసారి శివాజీకి సపోర్ట్ చేస్తున్నట్టు బయటపడిన నాగ్

వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు.

Bigg Boss 7 Day 69 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మరోసారి శివాజీకి సపోర్ట్ చేస్తున్నట్టు బయటపడిన నాగ్

Bigg Boss 7 Day 69 Highlights New Captain in House

Updated On : November 12, 2023 / 7:17 AM IST

Bigg Boss 7 Day 69 : శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ చివరి అంకంకి వచ్చి ఆగింది. ఫైనల్ గా శివాజీ, అర్జున్ నిలిచారు. అయితే ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ లు పెట్టె బిగ్ బాస్ ఈ సారి శివాజీ ఉండటంతో ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కెప్టెన్ ఎవరు అయితే బాగుంటుందని అడిగాడు. శివాజీకి ఓట్లు ఎక్కువ రావడంతో ఈ వారం కొత్త కెప్టెన్ గా శివాజీ ఎన్నికయ్యాడు. అయితే ఫిజికల్ టాస్క్ ఇస్తే శివాజీ గెలవలేడని తెలిసే కావాలని బిగ్‌బాస్ ఇలా చేసాడని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ వంతు రాగా.. నామినేషన్స్ లో శివాజీ మహిళా కంటెస్టెంట్స్ ని తిట్టిన వీడియో ప్లే చేసి.. నువ్వు క్యాజువల్ గా అన్నా ఆ మాటలు జనాలు తప్పుగా అర్ధం చేసుకుంటారు. వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సరిగ్గా చూసుకొని మాట్లాడు అంటూ చెప్పాడు నాగ్. అందరి మీద ఫైర్ అయిన నాగార్జున శివాజీకి మాములుగా చెప్పడంతో, ఫిజికల్ టాస్క్ తీసేసి శివాజీని కెప్టెన్ చేయడంతో మరోసారి శివాజీ టీంకి నాగార్జున డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తున్నట్టు అంతా భావిస్తున్నారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది.

Also Read : Bigg Boss 7 Telugu : ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఉంది వాళ్లే..! ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే..?

ఇక ఈ వారం పాస్ ఫెయిల్ అని గేమ్ పెట్టగా కంటెస్టెంట్స్ లో చాలా మంది రతిక ఫెయిల్ అని చెప్పారు. దీంతో రతిక ఈ వారం మళ్ళీ ఎలిమినేట్ అయిపోతానేమో అంటూ భయపడింది. నాగార్జున.. నువ్వు ఆడితే ఎలిమినేట్ అవ్వవు కదా, ఆడు అంటూ చెప్పాడు. ఇక నేడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సాయంత్రం 7 గంటల నుంచే ఉండనుంది. అలాగే ఎలిమినేషన్ తో పాటు స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఉండనున్నాయి.