Chiranjeevi : ‘ఆయ‌న మ‌ర‌ణం తీవ్రంగా క‌లిచివేసింది..’ సీతారాం ఏచూరి మృతి పట్ల చిరంజీవి సంతాపం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి క‌న్నుమూశారు.

Sitaram Yechury passed away Megastar Chiranjeevi condolences

Chiranjeevi – Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి క‌న్నుమూశారు. న్యుమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యతో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్‌కి దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.

ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. దశాబ్దాలపాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని పోరు సాగించి, సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషిచేసిన ఆయన మృతితో అరుణజ్యోతి ఆరిపోయినట్లయింద‌ని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలియ‌జేశారు. సీతారం ఏచూరి మ‌ర‌ణ‌వార్త త‌న‌ను మనోవేదనకు గురి చేసింద‌న్నారు.

Kalinga : ‘కళింగ’ మూవీ రివ్యూ.. చూసి భయపడాల్సిందే..

‘ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురిచేసింది. విద్యార్థి కార్యకర్తగా త‌న ప్ర‌యాణం మొద‌లైన‌ప్ప‌టి నుంచి కూడా అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు ఆయ‌న కృషి చేశారు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయ‌న చేసిన‌ ప్రజా సేవ, దేశం పట్ల ఆయ‌న‌కున్న‌ నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.’ అని చిరంజీవి అన్నారు.