సిద్ధు, శ్రద్ధ మరోసారి జంటగా.. ‘నరుడి బ్రతుకు నటన’

  • Publish Date - October 9, 2020 / 05:58 PM IST

Narudi Brathuku Natana: ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ Sithara Entertainments తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలసి నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలవగా ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో ఇటు టాలీవుడ్‌లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.


ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో Sithara Entertainments ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.


సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. చిత్రం టైటిల్ లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.


ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటంతో ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే…!
కాలభైరవ ఈ చిత్రానికి సంగీతమందించనున్నాడు.