Soundarya Rajinikanth : మరో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ మరో బాబుకి జన్మనిచ్చింది. సౌందర్య రజినీకాంత్, విషగన్‌ దంపతులకు వేద్ కృష్ణ అనే బాబు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలని షేర్ చేస్తూ..........

Siundarya Rajinikanth gave birth to another baby

Soundarya Rajinikanth :  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ మరో బాబుకి జన్మనిచ్చింది. సౌందర్య రజినీకాంత్, విషగన్‌ దంపతులకు వేద్ కృష్ణ అనే బాబు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలని షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టింది సౌందర్య. తాజాగా సౌందర్య పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Krishnam Raju with Other Heros : 50 మల్టీస్టారర్ సినిమాలు.. ఎక్కువమందితో కలిసి చేసిన హీరో.. ఆయన రూటే సపరేట్..

సౌందర్య రజినీకాంత్ తన బేబీ బంప్ ఫొటోలతో పాటు తనకు పుట్టిన బాబు చేతిని పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”దేవుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడికి నేను, విషగన్‌ స్వాగతం పలుకుతున్నాం. నాకు సహకరించిన డాక్టర్లకు ధన్యవాదాలు’’ అంటూ పోస్ట్ చేసింది. బాబుకి ‘వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి’ అని పేరు పెట్టారు. ఈ పేరుని కూడా తన సోషల్ మీడియాలో ప్రకటించింది సౌందర్య.