Sivaji Raja
Sivaji Raja : ఇటీవల తెలుగు వాళ్ళు అరుణాచలంను ఎక్కువగా దర్శిస్తున్నారు. చాగంటి గారు అరుణాచలం గొప్పతనం చెప్పడంతో తెలుగువాళ్లు అంతా అరుణాచలంకు క్యూ కట్టారు. అయితే అక్కడికి వెళ్లి భక్తితో దర్శనం చేసుకొని వచ్చేయకుండా కొంతమంది ఫొటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చిందరవందర చేస్తున్నారు. అక్కడి తమిళులు కూడా తెలుగు వాళ్ళు అరుణాచలం ఎందుకు వస్తున్నారు అంటూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.(Sivaji Raja)
అయితే తాజాగా ఇలాంటి సంఘటనలపై, అరుంచలంలో తెలుగు వాళ్ళు చేస్తున్న హంగామాపై సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడారు. 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా అరుణాచలం గురించి – తెలుగువాళ్ళ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Actress Hema: నాపై ఆ ట్రోలింగ్.. అమ్మను బలి తీసుకుంది..! తల్లి మరణం గురించి నటి హేమ ఎమోషనల్..
శివాజీరాజా మాట్లాడుతూ.. అరుణాచలం ఎవరికీ తెలియని రోజుల ముందే గత 30 ఏళ్లుగా నేను. మా మిసెస్, మా వాళ్ళు వెళ్తున్నాము. నాకు అక్కడ ల్యాండ్ కూడా ఉంది. అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు. మేము వెళ్తే సింపుల్ గా దండం పెట్టుకొని వచ్చేస్తాము. నేను. రాజా రవీంద్ర కూడా రెగ్యులర్ గా వెళ్తాము. ఈ మధ్య ఓ 25 శాతం మంది ఆ ప్లేస్ చూసి వస్తే ఎలా ఉంటది, ఎవరో చెప్పారు వెళ్లి చూసి రావాలి, ఒక వెకేషన్ ట్రిప్ లాగా చేసారు. తెలుగు వాళ్ళు ఆ 25 శాతం మంది ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనం.
అక్కడ రమణాశ్రమం చాలా సైలెంట్ గా ఉంటుంది. అక్కడికి వెంకటేష్, ఇళయరాజా చాలా మంది వస్తారు. ఒకసారి నేను, రాజా రవీంద్ర వెళ్లనప్పుడు కొంతమంది అక్కడ ఫొటోలు అని అరుస్తున్నారు. ఫారెనర్స్ వచ్చి మన వాళ్ళను సైలెన్స్ అని తిట్టారు. మనోళ్లు అరుపులకు అక్కడ నాశనమే. మనవాళ్ళు పూజిస్తారు కానీ అతిగా చేస్తారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. దేవుడి మీద భక్తి లేని వాళ్ళు అక్కడికి వెళ్లి ఏదో చూడాలి, ఫొటోలు దిగాలి అని నాశనం చేస్తున్నారు. భక్తి కోసం వెళ్ళేవాళ్ళు 75 శాతం ఉంటే దాన్ని నాశనం చేసేవాళ్ళు 25 శాతం ఉన్నారు అని అన్నారు. దీంతో శివాజీరాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Actress Hema: జనసేనలో జాయిన్ అవుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో నటి హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..