Sivaji Raja : అప్పటి క్రికెటర్ మాజీ భార్యని లవ్ చేసిన శివాజీ రాజా.. ఎవరో తెలుసా? వన్ సైడ్ లవ్ స్టోరీ భలే ఉందే..

శివాజీరాజా తన వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

Sivaji Raja Tells about his One Side Love Story with Ex Cricketer Wife Sangeeta Bijlani

Sivaji Raja : నటుడిగా, యాంకర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా శివాజీరాజా అందరికి పరిచయమే. ఒకప్పుడు టీవీ షోలు, సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్న శివాజీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత శివాజీ రాజా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపాడు.

ఈ క్రమంలో శివాజీరాజా తన వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

Also See : Ram Charan Wax Statue : రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు చూశారా?

శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి బాంబేలో ఉంటుంది. ఆమె కూడా సినీ పరిశ్రమనే. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లో నటించిన సంగీత బిజ్లానీ. ఆ యాడ్ చూసే ఆమెని లవ్ చేశాను. ఆమె అంటే నాకు ఇష్టం. పెళ్ళికి ముందు నా రూమ్ లో అన్ని ఆమె పోస్టర్స్ ఉండేవి. సంగీత బిజ్లానీ విషయం మా ఆవిడకు తెలిసినప్పటి నుంచి ఆమె అంటే మా ఆవిడకు పడదు. సంగీత బిజ్లానీని కలవలేనేమో అనుకున్నాను కానీ ఒక్కసారి కలిసాను. ఆమె క్రికెటర్ అజారుద్దీన్ ని పెళ్లి చేసుకుంది. క్రికెటర్ వేంకటపతి రాజు నాకు కజిన్. నేను, వేంకటపతి రాజు హైదరాబాద్ తాజ్ బంజారాలో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడికి సంగీత బిజ్లానీ వచ్చింది. వెంకటపతికి చెప్తే నేను పరిచయం చేస్తా అని తీసుకెళ్లి పరిచయం చేసాడు. హాయ్ అంటే హాయ్ అని మాట్లాడాను అంతే. అప్పటికే నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

సంగీత బిజ్లానీ 1980 లో మిస్ ఇండియా గెలిచింది. నిర్మా యాడ్ తో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత అనేక యాడ్స్ తో పాటు హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అజారుద్దీన్ ని 1996 లో పెళ్లి చేసుకోగా 2010 లో విడాకులు తీసుకుంది.

Also See : NTR YVS Chowdary New Movie Opening : జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు.. కొత్త ‘ఎన్టీఆర్’ సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..