×
Ad

Sivaji Raja : నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. తీసుకెళ్లి ఏకంగా శివాజీ రాజా భార్యకు చూపించి..

శివాజీ రాజా ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించారు. (Sivaji Raja)

Sivaji Raja

Sivaji Raja : సీనియర్ నటుడు శివాజీ రాజా ఎన్నో ఏళ్లుగా సినిమాలు, సీరియల్స్, టీవీ షోలతో మెప్పిస్తునే ఉన్నారు. ఇప్పటికి పలు సినిమాల్లో శివాజీ రాజా నటిస్తూ మెప్పిస్తున్నారు. శివాజీ రాజా ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించారు. తాజాగా నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.(Sivaji Raja)

రాజు వెడ్స్ రాంబాయిలో శివాజీ రాజా – అనిత చౌదరి భార్య భర్తలుగా నటించారు. అనిత చౌదరి కూడా ఎన్నో ఏళ్లుగా సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు. శివాజీ రాజా – అనిత చౌదరి జంటగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో కూడా కలిసి నటించడంతో సక్సెస్ మీట్ లో ఇద్దరూ కలిసి మాట్లాడారు.

Also Read : Celina Jaitly : భర్తపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిన మంచు విష్ణు హీరోయిన్.. ఏకంగా 50 కోట్లు ఇమ్మంటూ.. పైగా ప్రతినెలా..

ఈ క్రమంలో శివాజీ రాజా అనిత చౌదరి గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేసాము. మంచి నటి. సెట్ కి టైంకి వస్తుంది. ఒకప్పుడు మురారి షూటింగ్ లో ఆమె ఖాళీగా కూర్చుంది. అది చూసి నువ్వు ఖాళీగా కూర్చోకు తెలుగులో ఒక లవ్ లెటర్ రాసి ఆమెకు ఇవ్వు అని కృష్ణవంశీ చెప్పాడు. సరే అని సరదాగా నేను గోదావరి జిల్లా అచ్చ తెలుగు భాషలో లవ్ లెటర్ రాసి ఇచ్చాను. అది తనొక్కదే చదవకుండా యూనిట్ అంతా చదివి వినిపించింది. సరే అక్కడితో వదిలేయకుండా నాకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉంటే ఆ లెటర్ మా మిసెస్ కి చూపించింది అని చెప్పారు.

Also Read : Malavika Mohanan : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై హీరోయిన్ కామెంట్స్.. ఏదో రెండు మూడు సీన్స్ ఇస్తారనుకున్నా..