Bigg Boss Sivaji : బిగ్‌బాస్ శివాజీ కొడుకుని చూశారా? హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ పెద్ద కొడుకు..

తాజాగా నేడు రాబోయే ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు.

Sivaji Son Entry into Bigg Boss House Promo Goes Viral

Bigg Boss Sivaji : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోగా కూడా వరుస సినిమాలతో మెప్పించాడు శివాజీ. ఒకప్పుడు మంచి మంచి హిట్ సినిమాలతో కెరీర్ చూసి ఆ తర్వాత వరుస సినిమాలు ఫెయిల్ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. 2016 లో చివరిసారిగా సీసా అనే సినిమాతో పలకరించిన శివాజీ 2018లో ఓ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ చేశారు.

సినిమాలకు దూరమైనా కొన్ని రోజులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. కానీ కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు కూడా దూరంగా ఉన్న శివాజీ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక హౌస్ లో మొదటి రోజు నుంచి కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నట్టు బిల్డప్స్ ఇస్తూ తనకంటూ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు శివాజీ. అలాగే హౌస్ లో గాయపడగా, బయటకి వెళ్ళిపోతాను, ఉండలేకపోతున్నాను అంటూ గత కొన్ని రోజులుగా సింపతీ గేమ్ ఆడుతున్నాడు.

తాజాగా నేడు రాబోయే ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. శివాజిని చెక్ చేయడానికి డాక్టర్ వచ్చారని ఒక రూమ్ లోకి వెళ్ళమన్నాడు బిగ్ బాస్. మొదట డాక్టర్ లా శివాజీకి చెకప్ చేసి అనంతరం నాన్న అంటూ పిలిచి శివాజీని ఆశ్చర్యపరిచాడు శివాజీ తనయుడు. దీంతో శివాజీ చాలా రోజుల తర్వాత కొడుకుని చూసిన ఆనందంతో ఏడ్చేశాడు.

Also Read : Yatra 2 Movie : ‘యాత్ర 2’ సినిమాలో సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

తన కొడుకుని హౌస్ లోకి తీసుకొస్తూ నా కొడుకు అంటూ అందరికి పరిచయం చేశాడు శివాజీ. అందరూ అతనికి గ్రీటింగ్స్ తెలిపారు. ఇక శివాజీ, తన కొడుకు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. శివాజీ మరోసారి ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. దీంతో మీరు ఏడవకండి నాన్న అంటూ కొడుకు ఓదార్చాడు. మీరు నవ్వితేనే ఇంట్లో అందరూ నవ్వుతారు అని తాను కూడా ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి శివాజీ కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.