Yatra 2 Movie : ‘యాత్ర 2’ సినిమాలో సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
యాత్ర 2 సినిమాలో అప్పటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉంటాయని తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Suzanne Bernert Plays Sonia Gandhi Role in Yatra 2 Movie
Yatra 2 Movie : 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా ‘యాత్ర 2’ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో వైఎస్సార్ మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, జగన్ సీఎం ఎలా అయ్యాడు అనే దానిపై ఉండబోతుందని సమాచారం. మొదటి పార్ట్ లో వైఎస్సార్ గా నటించిన మమ్ముట్టి(Mammootty) ఈ పార్ట్ లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా(Jiiva) నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాత్ర 2 సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో అప్పటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉంటాయని తెలిసిందే. యాత్ర 2 సినిమాలో చంద్రబాబు పాత్రని బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నాడని సమాచారం. తాజాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యాత్ర 2 సినిమాలో సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు.
Also Read : Allu Aravind : హీరోల రెమ్యునరేషన్స్, సినిమాల ఖర్చుపై అల్లు అరవింద్ కామెంట్స్..
జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ ఇంగ్లీష్ లో పలు సినిమాలు, యాడ్స్ చేశారు. అనంతరం బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో కూడా నటించారు. ఇప్పుడు యాత్ర 2 సినిమాలో సోనియా గాంధీ పాత్రలో నటిస్తున్నారు సుజానే బెర్నెర్ట్. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అచ్చం సోనియా గాంధీలాగే ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే సోనియా గాంధీ నటిస్తున్నట్టు ఉంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె గతంలో మన్మోహన్ సింగ్ పై వచ్చిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే సినిమాలో కూడా సోనియా గాంధీ పాత్ర పోషించింది.