Site icon 10TV Telugu

SJ Suryah : 23 ఏళ్ళ తర్వాత ఆ థియేటర్‌కి వెళ్లిన డైరెక్టర్.. అప్పుడు పవన్ కోసం.. ఇప్పుడు నాని కోసం..

SJ Suryah Interesting Comments while Remembering Pawan Kalyan Kushi Movie

SJ Suryah Interesting Comments while Remembering Pawan Kalyan Kushi Movie

SJ Suryah : నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది.

ఈ ఈవెంట్లో నటుడు, దర్శకుడు SJ సూర్య మాట్లాడుతూ.. ఖుషి సినిమా తర్వాత సుదర్శన్ థియేటర్ కి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఖుషి తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది అని తెలిపి అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు.

Also Read : Tollywood Actor : 49 ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. ఈ పిల్లోడు ఇప్పుడు హీరో..

2001లో SJ సూర్య దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వచ్చి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత SJ సూర్య సుదర్శన్ థియేటర్ కి వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి సందడి చేసారు. మళ్ళీ ఇప్పుడు 23 ఏళ్ళ తర్వాత నానితో సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఆ థియేటర్ కి రావడం విశేషం.

 

https://www.youtube.com/watch?v=XWZcrVjC5Y4

Exit mobile version