ఎలా సినిమాలు తీయాలి? మా భవిష్యత్ ఏంటి? మా రిటర్న్స్ ఏంటి? మేం బతకాలా? చావాలా?: నిర్మాత ఎస్‌కేఎన్‌

కొందరు పెద్దలు పోలీసు కేసులు, కోర్టు కేసులను తప్పించుకోవడానికి కార్మికులను రెచ్చగొడుతున్నారు. కేసులుంటే మీరు కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు జెండాలు, ఎజెండాలు ఉన్నాయి.

తమ వేతనాలు 30 శాతం పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై చిన్న నిర్మాతలు స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇందులో ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. “మా నాన్ థియేటర్లు ఎవరు డీల్ చేస్తారు? ఓటీటీలు ఎవరు సెట్ చేస్తారు? అవన్నీ చేసేవాళ్లుంటే రండి.. 50 శాతం వేతనాలు పెంచుదాం. హక్కుల గురించి మాట్లాడే వాళ్లు బాధ్యతల గురించి కూడా గుర్తుంచుకోవాలి. 2022లో ఒప్పందం చేసుకున్నపుడు చిన్న నిర్మాతలకి 25 శాతం తగ్గించి ఇవ్వాలని చెప్పింది.

ఆ రూల్ ఏమైంది? ప్రొడ్యూసర్స్ అంటే క్యాష్ బ్యాగ్ కాదు. రైస్ బ్యాగ్.. కిరణ్ అబ్బవరం నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఏ హీరోలు అయినా కూడా అలా చేస్తున్నారా? మీరు చస్తే చావండి మాకు 30 శాతం పెంచమంటే ఏం న్యాయం? మేం రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్. మేం తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగు ఇస్తున్నాం.

దర్శకుల సంఘం ఎటువైపు? మా అసోసియేషన్ ఎటువైపు? మీ చావు మీరు సంబంధం లేదంటే మాకీ సినిమాలే వద్దు. సినిమాలకి బిజినెస్ లేక చస్తుంటే రేట్లు పెంచమంటే ఎలా? యూనియన్లనే తీసుకోవాల్సిన రూల్ ఏంటి?

కొందరు పెద్దలు పోలీసు కేసులు, కోర్టు కేసులను తప్పించుకోవడానికి కార్మికులను రెచ్చగొడుతున్నారు. కేసులుంటే మీరు కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు జెండాలు, ఎజెండాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ సీఎంలు, సినిమాటోగ్రఫీ మంత్రులను అడుగుతున్నాం. మేం ఎలా బతకాలి? ఎలా సినిమాలు తీయాలి? మా భవిష్యత్ ఏంటి? మా రిటర్న్స్ ఏంటి? మేం బతకాలా? చావాలా? హక్కుల గురించి మాట్లాడుతున్నారు.. మరి బాధ్యతల గురించి మాట్లాడేది ఎవరు? హక్కుల గురించే మాట్లాడితే మేం మాకు నచ్చిన వాళ్లతో పనిచేయించుకుంటాం” అని అన్నారు.

“నిర్మాతలకు ఎవరితో ఎప్పుడు ఎలా పని చేయాలనే ఆప్షన్ ఉండాలి. వేతన పెంపు యాభై శాతం చేద్దాం. కానీ మా సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారు? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదు.
ఇప్పుడు సినిమాలకు సరైన బిజినెస్ అవటం‌ లేదు. అయినా రెండు వేలు లోపు వేతనాలు తీసుకునే కార్మికులకు పెంచుతామన్నాం.
టికెట్ రేట్ల పెంపు పెద్ద సినిమాలకే.. ఏడాదికి అలాంటివి పది మాత్రమే వస్తాయి. మిగతావి 200 సినిమాలు ఉంటాయి. మా లాంటి చిన్న సినిమాలకు టికెట్ రేట్లు వర్తించవు. ఇండస్ట్రీ బాగుంటేనే అందరి బావుంటారు‌. ఇండస్ట్రీ లో నలిగిపోతున్న నిర్మాత పక్కన ఎవరూ లేరు.
అందరూ సిండికేట్ అయి నిర్మాతలను చంపేస్తున్నట్లు ఉంది. మీ మీద కోర్ట్ కేసులు ఉన్నప్పుడు కార్మిక నాయకులుగా ఉండకూడదు. మా సినిమాలు మేము ఇష్టం వచ్చినట్లు తీసుకుంటాం. నిర్మాత అంటే క్యాష్ బ్యాక్ అనే ఆలోచన ఉంది‌. కానీ మేము సినిమా కోసం వడ్డీలకు అప్పులు తీసుకు వచ్చి సినిమాలు చేస్తున్నాము” అని చెప్పారు.