Prabhas : ప్రభాస్ పై బాలీవుడ్ నటుడి కామెంట్లు.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
- Thota Vamshi Kumar
- Published On : August 19, 2024 / 09:55 AM IST
SKN Reacts to Arshad Warsi criticised Prabhas role in Kalki 2898 AD
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అర్షద్ చేసిన వ్యాఖ్యలను ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్(ఎస్‌కెఎన్) దీనిపై స్పందించారు. గుర్తింపు కోసం ప్రభాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతుంటారని ఎద్దేవా చేశాడు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా అర్షద్ కామెంట్లపై స్పందించాడు. ఎంతో మంది అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే వ్యక్తిని అలా అనడం సబబు కాదన్నారు. సినిమాకు రివ్వ్యూ ఇవ్వొచ్చునని, విమర్శించవచ్చునని చెప్పారు. అయితే.. అర్షద్ వాడిన పదాలు నిర్మాణాత్మకమైన విమర్శలు కావన్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేదన్నారు.
Prabhas : ప్రభాస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంతకి అర్షద్ వార్సి ఏమన్నాడంటే..?
ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సి మాట్లాడుతూ.. ‘కల్కి 2898 AD’ మూవీ చూసినట్లుగా చెప్పాడు. అయితే.. ఈ మూవీ తనకు నచ్చలేదన్నాడు. అమితాబ్ బచ్చన్ మాత్రం అశ్వత్థామగా అదరగొట్టాడని అన్నాడు. ఈ వయసులో ఇలా నటించడం చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు. ఆయనకు ఉన్న శక్తితో తనకు కొంచెం అయిన ఉండి ఉంటే ఈ పాటికే లైఫ్ సెట్ అయిపోయేదన్నారు. ఇక మూవీలో ప్రభాస్ పోషించిన పాత్ర బాలేదన్నారు. ఆయన పాత్ర ఓ జోకర్‌లా ఉందన్నారు.
తాను ప్రభాస్‌ను మ్యాడ్ మాక్స్ లాంటి మూవీలోని మెల్ గిబ్బన్‌లా చూడాలనుకున్నానని, అయితే చూసింది వేరన్నారు. అర్షద్ వార్సి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన పై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Raksha Bandhan : సిస్టర్ సెంటిమెంట్‌తో టాలీవుడ్‌లో వచ్చిన సినిమాలు ఇవే..
మున్నాభాయ్ సిరీస్, జాలీ ఎల్‌ఎల్‌బీ, గోల్‌మాల్ ఫ్రాంచైజీ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.
