Raksha Bandhan : సిస్టర్ సెంటిమెంట్‌తో టాలీవుడ్‌లో వచ్చిన సినిమాలు ఇవే..
అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు మన టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి.

Raksha Bandhan 2024 : సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండగగా రక్షా బంధన్ జరుపుకుంటారు. తోడబుట్టిన వాళ్లని కలుసుకుని రాఖీ కట్టుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఓ సినిమాను చూడొచ్చు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు మన టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోలు అందరూ సిస్టర్ సెంటిమెంట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని అటు యూట్యూబ్, ఇటు ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నాయి. మచ్చుకు కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
– హిట్లర్
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రంభ జంటగా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో అన్నా చెల్లెళ్ల మూవీల్లో బెస్ట్ మూవీల్లో ఒకటి. ఇందులో ఐదుగురు అమ్మాయిలకు అన్నయ్యగా చిరు నటించారు. చెల్లెల్లు మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలని తాపత్రపడే అన్నయ్య పాత్రలో చిరు నటన అదుర్స్. చిరు చెల్లెల్లుగా శారద, అనుపమ, లక్ష్మి, గాయత్రి, సరస్వతి నటించారు.
Revu : ‘రేవు’ ట్రైలర్ రిలీజ్.. ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తా అన్న దిల్ రాజు..
– పుట్టింటికి రా చెల్లి
యాక్షన్ హీరో అర్జున్ నటించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. చెల్లెలు సెంటిమెంట్‌తో తెరకెక్కింది. ఈ మూవీలో అర్జున్‌కు చెల్లిగా మధుమిత కనిపించింది. అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. మీనా హీరోయిన్‌గా నటించగా కోడి రామకృష్ణ తెరకెక్కించారు.
– గోరింటాకు
ఈ మూవీలో రాజశేఖర్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు. రాజశేఖర్ చెల్లిగా మీరా జాస్మిన్ నటించింది. చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోవడంతో అన్నీ తానైన చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు. చెల్లెలు ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేస్తాడు. అయితే.. ఆస్తి కోసం అయిన వాళ్లు చెల్లి భర్తను జైలుకు పంపిస్తారు. సాయం కోసం అన్నయ్య ఇంటికి వచ్చిన చెల్లిని ఆర్తి అగర్వాల్ అవమానించి పంపుతుంది. ఏం చేయాలో తెలియని మీరా జాస్మిన్ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. చెల్లి డెడ్ బాడీ దగ్గర రాజశేఖర్ ఏడ్వడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
– రాఖీ
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. తన చెల్లిని చంపిన అత్తింటి వారిని, వారికి వత్తాసు పలికిన అధికారులను తగలబెడతాడు. ఆ తరువాత ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నలా అండగా నిలుస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు.
Ram Charan : వన్డే ప్రపంచకప్‌తో రామ్‌చరణ్.. భారత్‌కు తీసుకురావాలని కోరుతున్న ఫ్యాన్స్..!
అన్నవరం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాగా, తమిళ నటి సంధ్య చెల్లిగా నటించిన చిత్రం ‘అన్నవరం‘. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అన్నవరం తన సోదరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అన్నాచెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఇవే కాకుండా మహేష్ బాబు నటించిన అర్జున్, బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య, సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం, వెంకటేశ్ నటించిన గణేశ్, జగపతి బాబు నటించిన శివరామరాజు, కృష్ణ నటించిన సంప్రదాయ,శోభన్ బాబు నటించిన జీవనరాగం, చెల్లెలి కాపురం, బంగారు గాజులు, పల్నాటి పౌరుషం సినిమాలు కూడా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన మూవీలే.