so many Requests to AR Rahaman for Re Create SP Balasubrahmanyam Voice with AI
AR Rahaman : ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చనిపోయిన ఇద్దరి సింగర్స్ వాయిస్ లని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)తో బతికించారు. రజినీకాంత్(Rajinikanth) ముఖ్య పాత్రలో, విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమాలో తిమిరి ఎళుదా.. అనే ఓ సాంగ్ ని గతంలో మరణించిన బంబా బక్యా(Bamba Bakiya), షాహుల్ హమీద్(Shahul Hameed) సింగర్ల వాయిస్ లతో పాడించారు.
ఈ ఇద్దరు సింగర్స్ ఎప్పుడో మరణించినా ఇటీవల టైం లెస్ వాయిస్ అనే సంస్థ సహకారంతో AIతో చనిపోయిన ఆ ఇద్దరి వాయిస్ లని మళ్ళీ క్రియేట్ చేసి లాల్ సలామ్ సినిమాలోని సాంగ్ ని రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడించడంతో ఈ పాట వైరల్ గా మారింది. ఆ ఇద్దరి ఫ్యామిలీల పర్మిషన్ తీసుకొని, వారికి తగినంత పారితోషికం ఇచ్చే ఈ ప్రయోగం చేశారు AR రెహమాన్.
Also Read : Baby Movie : ‘బేబీ’ సినిమా రెండు భాషల్లోకి రీమేక్.. వాలెంటైన్ డేకి స్పెషల్ అప్డేట్..
తాజాగా దీనిపై స్పందిస్తూ AR రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మరణించిన వారి వాయిస్ లని బతికించడంతో ఇప్పుడు చాలామంది దీని గురించి అడుగుతున్నారు. చాలామంది SP బాలసుబ్రహ్మణ్య గారి వాయిస్ ని రీ క్రియేట్ చేయమని అడుగుతున్నారు. నేను దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను అని తెలిపారు. ఒకవేళ దానిపై కూడా ప్రయోగం చేస్తే త్వరలోనే బాలు గారి గొంతుని మళ్ళీ మనం వినొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఇలా మంచికి కూడా వాడుకోవచ్చు అని రెహమాన్ ప్రూవ్ చేసారు.