so Proud Mahesh babu tweets on nephew Ashok Galla Devaki Nandana Vasudeva movie success
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి రావడంతో ఇప్పటికే ఈ యంగ్ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న(22 నవంబర్)న రిలీజ్ అయ్యింది. ఇక విడుదలైన మొదటి ఆట నుండే పాసిటివ్ టాక్ తెచ్చుకుంది దేవకీ నందన వాసుదేవ.
Also Read : Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్, చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..
అయితే మహేష్ బాబు మేనల్లుడు కావడంతో తన వంతు ఈ సినిమాను ప్రమోట్ చేసారు మహేష్. తాజాగా దేవకీ నందన వాసుదేవ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ‘అశోక్ గల్లా.. సినిమాలో నీ మార్పు చాలా బాగుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ టీమ్ అందరికి నా అభినందనలు” అంటూ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు మహేష్ బాబు.
#DevakiNandanaVasudeva @AshokGalla_ what a transformation!! So so proud ♥️♥️♥️ Congratulations to the entire team!! @ArjunJandyala @varanasi_manasa @PrasanthVarma #BheemsCeciroleo @saimadhav_burra @lalithambikaoff
— Mahesh Babu (@urstrulyMahesh) November 22, 2024
దీంతో మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ సినిమాకి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందిచడం విశేషం. కాగా ఇందులో మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.