Sobhita Dhulipala
Sobhita Dhulipala : నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ తెలుగులో తన కొత్త సినిమా ‘చీకటిలో’ తో రాబోతుంది. శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 23న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ధూళిపాళ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.(Sobhita Dhulipala)
చాన్నాళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేయడంతో శోభిత ధూళిపాళ తెలుగు గురించి, ఇక్కడ సినిమాలు, ప్రేక్షకుల గురించి మాట్లాడింది.
Also Read : Suhasini : చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో బెస్ట్ మూమెంట్స్.. లైఫ్ లో మర్చిపోలేను.. సుహాసిని కామెంట్స్..
శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. నాకు తెలుగు అంటే ఇష్టం. తెలుగులో మాట్లాడటం, పదాలు, స్పీచ్ లు ఇష్టం. తెలుగు ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా రాలేదు. ఇక్కడ లిమిట్ గా వర్క్ చేశాను. గూఢచారి, మేజర్ చేశాను అంతే. ఇప్పుడు నేను ఉన్న నా లైఫ్ విషయంలో, నేను తెలుగు అమ్మాయిని, నా కల్చర్ తెలుగు అందుకే ఈ కథ రాగానే చేశాను. ఇది తెలుగు వాళ్లకు నాకు బ్రిడ్జ్ గా ఉంటుంది. నేను చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను నటించేది తెలుగులో కాబట్టి నా ఆలోచనలు, సీన్స్ అర్ధం చేసుకోవడం అన్ని తెలుగులో ఉంటాయి కాబట్టి సింపుల్ గా అనిపించింది ఈ సినిమా.
నేను ఇంటర్ పూర్తి చేసిన వెంటనే ముంబయి వెళ్లిపోయాను. అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం మొదలుపెట్టాను. నేను బాలీవుడ్‌లో సినిమా చేస్తుంటే మీరు తెలుగమ్మాయి అంటారు. ఇక్కడికొస్తే బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా అంటారు. వేరే ఇండస్ట్రీకి వెళ్తే ఇంకేదో అంటారు. అలా ఎక్కడ చేసినా అడుగుతారు. ప్రస్తుతానికి ఈ ‘చీకటిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవ్వాలని అనుకుంటున్నా. దీని తర్వాత నేను చేయబోయే తమిళ సినిమా ఒకటి తెలుగులోకి రానుంది. నేను వేరే భాషల్లో చాలా సినిమాలు చేశాను. కానీ తెలుగులో అంతగా కుదరలేదు. శేష్ తో గూఢచారి, మేజర్ చేశాను. నాకు కథ, పాత్ర నచ్చితేనే చేస్తాను అని తెలిపింది.
Also Read : Varsha Bollamma : చీరకట్టులో కానిస్టేబుల్ కనకం.. వర్ష బొల్లమ్మ ఫొటోలు..