Sobhita Dhulipala sensational comments on her career starting days
Sobhita Dhulipala : మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. హిందీలో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా గూడాచారి, మేజర్ సినిమాలతో కూడా మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో హడావిడి చేస్తుంటుంది శోభిత. ప్రస్తుతం శోభిత మెయిన్ లీడ్ లో నటించిన ది నైట్ మేనేజర్ అనే సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శోభిత వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది.
Tollywood Movies : టాలీవుడ్.. జనవరి హిట్టు, ఫిబ్రవరి ఓకే.. మరి మార్చ్ సంగతేంటి?
తాజాగా శోభిత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో తనకి జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది. శోభిత మాట్లాడుతూ .. నేను మోడల్ గా ట్రై చేస్తున్న సమయంలో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఓ కంపెనీకి మోడల్స్ ఆడిషన్ కి వెళ్తే నన్ను కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అన్నారు. అందంగా లేవు అన్నారు. నేను అప్పుడు ఏమి మాట్లాడలేదు. అవును అని చెప్పి వచ్చేశాను. కానీ ఆ తర్వాత వాళ్ళు అదే కంపెనీకి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాకపోతే ఒకప్పుడు వాళ్ళు నన్ను అలా అన్నది వాళ్లకు గుర్తు లేకపోవచ్చు అని చెప్పింది. అయితే ఆ కంపెనీ ఏంటి అనేది శోభిత చెప్పకపోవడం గమనార్హం.