HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ సినిమా.. థియేటర్స్ లో ఆ సీన్స్ డిలీట్..

ఈ విమర్శలు మూవీ యూనిట్ వరకు వెళ్లాయి.

HariHara VeeraMallu

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నిన్న జులై 24న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా మంచి కాన్సెప్ట్ అయినా సాంకేతికంగా కొన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ తో పాటు విఎఫ్ఎక్స్ బాగోలేదు. దీంతో ఈ సినిమా VFX విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు మూవీ యూనిట్ వరకు వెళ్లాయి.

నిన్న సక్సెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ సాంకేతికంగా సినిమాలో తప్పులు ఉన్నాయి అన్నారు. వాటిని మేము కరెక్ట్ చేసుకుంటాం అని చెప్పారు. మూవీ యూనిట్ సినిమాపై వచ్చిన విమర్శలు చూసి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేసి థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ చేసారు.

Also See : HariHara VeeraMallu Success Meet : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్ ఫొటోలు..

హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ లో గుర్రం సవారీ VFX సీన్స్ ని కొన్ని తొలగించారట. అలాగే తోడేలుతో ఉండే కామెడీ సీన్స్ ని తొలిగించారని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ సీన్ కూడా VFX బాగోలేదని తొలిగించారని తెలుస్తుంది. అలా సినిమా నిడివి దాదాపు 5 నుంచి 10 నిముషాలు తగ్గిందని సమాచారం.