Sonali Bendre : అప్పట్లో అభిమాని సూసైడ్.. ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన హీరోయిన్..

తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే మాట్లాడుతూ ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది.

Sonali Bendre : సోనాలి బింద్రే.. అనగానే మురారి, ఇంద్ర, మన్మధుడు, ఖడ్గం.. లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. ఆ రోజుల్లో తన అందంతో తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి అక్కడ హిట్స్ కొట్టిన తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. అయితే పెళ్లి, క్యాన్సర్ రావడం, క్యాన్సర్ తో పోరాడటం.. వీటితో సినీ పరిశ్రమకు చాలా గ్యాప్ ఇచ్చింది.

ప్రస్తుతం సోనాలి బింద్రే మళ్ళీ సినిమాలు, టీవీ షోలతో బిజీ అవుతుంది. కొన్ని బాలీవుడ్ షోలతో అలరిస్తుంది. ఇదే క్రమంలో పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే మాట్లాడుతూ ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది.

Also Read : Trivikram : పవన్ గెలుపు.. తిరుమలకు కాలి నడకన త్రివిక్రమ్.. త్రివిక్రమ్ తనయుడిని చూశారా?

సోనాలి బింద్రే మాట్లాడుతూ.. అభిమానులు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. గతంలో ఓ అభిమాని నన్ను కలవలేకపోయినందుకు బాధపడి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అది నన్ను చాలా బాధపెట్టింది. ఇలా హీరో, హీరోయిన్స్ ని కలవలేకపోయామని ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అది మమ్మల్ని కూడా బాధపెడుతుంది. ఇక నాకు కొన్ని ఉత్తరాలు కూడా వచ్చేవి అభిమానుల నుంచి. అందులో కొన్ని రక్తంతో రాసేవారు. దానికి చాలా బాధేసేది. అభిమానించడం తప్పు కాదు కానీ ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే అని తెలిపింది. దీంతో సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు