Sonu Sood : రియల్ హీరో కొత్త సినిమా..
రియల్ హీరో సోనూ సూద్ హీరోగా కొత్త సినిమా.. లుక్ అదిరిందిగా..
- sekhar
- Published on- December 23, 2021 / 04:04 PM IST
Fateh Movie
Sonu Sood: సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆదుకుని వారి పాలిట దేవుడిగా నిలిచిన సోనూ సూద్ సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!
పాండమిక్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ లో కీ క్యారెక్టర్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనూ సూద్.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ లో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?
ఇప్పుడు సోనూ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘ఫతే’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘One Man’s War Against India’s Hidden Enemy’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. సోనూ సూద్ భార్య సోనాలీ సూద్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. జీ స్టూడియోస్ సమర్పణలో శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా అభినందన్ గుప్తా డైరెక్ట్ చేస్తున్నారు. 2022లో ‘ఫతే’ రిలీజ్ కానుంది.
