Sonu Sood: చిన్న పిల్లాడిలా సోనూ.. ఎయిర్ పోర్టులో ఫన్నీ మూమెంట్స్!
కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Sonu Sood
Sonu Sood: కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలలో విలన్ పాత్రలలో నటించే సోనూసూద్.. కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎవరికి ఏం సాయం కావాలన్నా ఆదుకొని ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఇతర దేశాలలోని భారతీయుల నుండి మారుమూల గ్రామంలోని చిన్న సమస్యల వరకు స్పందించి చేయి అందిస్తూనే ఉన్నాడు.
నిజజీవితంలో హీరోగా మారిన సోనుకు ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తుతుండగా ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వీధి వ్యాపారులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి వారికి ప్రచారం చేసిపెడుతున్నాడు. కాగా, సోనూసూద్ లో కూడా ఇంకా చైల్డిష్ బిహేవియర్ పోలేదు. ఎంత హీరో అయినా వారిలో కూడా కాస్తంత ఫన్నీ యాంగిల్ కూడా ఉంటుంది కదా. సోనూ కూడా విమానాశ్రయంలో ఓ పిల్లాడిలా మారి ఎస్కెలేటర్ మీద ఆటలాడుకుంటున్నాడు.
ఎస్కలేటర్ మీద పై నుండి కిందకి వస్తున్న సోనూసూద్ మెట్ల మీద అడుగులు తీసి గాల్లో ఎగురుతున్నట్లుగా కిందవరకూ వచ్చాడు. దీన్ని ముందున్న వ్యక్తి వీడియో తీశాడు. సోనూ ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏమాట కామాట.. ఇలా చేతుల మీద ప్రెజర్ పెట్టి గాల్లో ఎగరాలంటే ఫిట్నెస్ కూడా గట్టిగానే కావాలి. సోనూ అంటే సిక్స్ ప్యాక్ కాబట్టి ఏదైనా చేస్తాడు. కాబట్టి మీరు ఇలాంటివి ట్రై చేయకపోతేనే బెటర్.
View this post on Instagram