Sonu Sood : విద్యార్థులకు వరం..
చార్టెడ్ అకౌంటెంట్స్ చదివాలనుకునే పేద విద్యార్థులకు అండగా నిలబడబోతున్నారు ‘రియల్ హీరో’ సోనూ సూద్..

Sonu Sood Pledges Free Ca Education To Aspirants
Sonu Sood: కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సాయమందిస్తూ రియల్ హీరోగా, సహాయం పొందిన వారి పాలిట దేవుడిగా మారిన నటుడు సోనూ సూద్ రోజురోజుకీ తన సేవా కార్యక్రమాలను విస్తరింపజేస్తున్నారు. ఇప్పుడాయన మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం ఇటీవల సోనూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఐఏఎస్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి స్థోమతలేని ఔత్సాహిక విద్యార్థులకు ప్రోత్సాహకంగా వారికి స్కాలర్‌షిప్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు. స్కాలర్‌షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూ సూద్ తెలిపారు.
Sonu Sood : పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో..
అలాగే ఇప్పుడు మరో అడుగుముందుకు వేసి.. CA స్టూడెంట్స్‌కు కూడా సాయమందించాలని నిర్ణయించుకున్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ చదివాలనుకునే పేద విద్యార్థులకు అండగా నిలబడబోతున్నారు. ఆసక్తిగల విద్యార్థులు http://soodcharityfoundation.org ద్వారా రిజిష్టర్ చేసుకోవాలని ప్రకటించారు ‘రియల్ హీరో’ సోనూ సూద్..
For India’s economy to grow, we need bright CA’s.????
A small step.
Visit. https://t.co/juJL7WB7qo@wirc_icai@manishgadia_gst@arpitkabra25@mehtapareen17@SoodFoundation?? pic.twitter.com/XWCzKJz6cH— sonu sood (@SonuSood) July 1, 2021